![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -257 లో.... దశరథ్ ఇంటికి వస్తాడు. ఎవరో నా గదికి గడియ పెట్టారని సుమిత్ర అనగానే.. ఇది జ్యోత్స్న పని అయి ఉంటుందని దశరథ్ అనుకుంటాడు. దశరథ్ జరిగిన విషయంతో ఇంకా షాక్ లోనే ఉండి ఏదో ఏదో మాట్లాడుతుంటే.. నేను చేసిన పనిని డాడ్ చూసాడా ఏంటని జ్యోత్స్న కంగారుపడుతుంది. దశరథ్ షర్ట్ కి రక్తం ఉంటుంది. అది చూసి ఏమైందని సుమిత్ర కంగారుపడుతుంటే దారిలో ఒకరికి హెల్ప్ చేసానని దశరథ్ చెప్తాడు.
ఆ హెల్ప్ చేసింది దాస్ కి అయితే కాదు కదా అని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శౌర్యని తీసుకొని వెళ్ళడానికి దీపని ఎలా ఒప్పించాలని కార్తీక్ కంగారుపడతాడు. నా ఫ్రెండ్ అర్జెంట్ గా బెంగళూరు వెళ్లాడు తనకి ఓ పాప ఇంకా అమ్మ ఉంది.. వాళ్ళ పాప దగ్గర శౌర్యని వారం రోజులు ఉంచమన్నాడు.. నేను ఉంచుతానని మాటిచ్చానని కార్తీక్ అంటాడు. మొదట దీప వద్దని అంటుంది కానీ ఆ తర్వాత కార్తీక్ దీపని ఓప్పిస్తాడు. మరుసటిరోజు ఉదయం డాక్టర్ తో కార్తీక్ మాట్లాడతాడు. అయిదు లక్షలు అడ్వాన్స్ కట్టాలని డాక్టర్ చెప్పగా.. సరేనని కార్తీక్ అంటాడు. అయిదు లక్షలు ఎలా ఏర్పాటు చెయ్యాలని కార్తీక్ అనుకుంటుండగా.. అప్పుడే దీప వచ్చి.. ఎందుకు అంత డబ్బు అని అడుగుతుంది. రెస్టారెంట్ కి అని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. కానీ దీపకి మాత్రం డౌట్ వస్తుంది.
కాసేపటికి కార్తీక్ తన ఫ్రెండ్ ని డబ్బు అడుగుతాడు. నువ్వు ఇగోకి వెళ్లి ఈ పరిస్థితికి వచ్చావ్.. మీ తాతయ్యకి సారీ చెప్పమని అతను అంటుంటే.. కార్తీక్ తనపై కోప్పడతాడు. దాంతో అతను వెళ్లిపోతాడు. అదంతా కాశీ చూసి.. ఎందుకు బావ నీకు అంత డబ్బు అని అడుగుతాడు. దాంతో శౌర్య గురించి కాశీకి చెప్తాడు కార్తీక్. ఈ విషయం అక్కకి తెలియదా అని కాశీ అడుగగా.. తెలియదని కార్తీక్ చెప్తాడు. మరి నన్నెందుకు అడగలేదని కాశీ అనగానే.. పరిస్థితి చూసి ఎలా అడుగుతానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |